విద్యార్థులకు అలర్ట్: జేఈఈ మెయిన్ 2027 మొదటి విడత దరఖాస్తులు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2027 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ చివరి వారంలో ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వెబ్సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జనవరి నెలలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు తమ విద్యా ధ్రవీకరణ పత్రాలు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.