పదిహేను రూపాయలకే అన్ లిమిటెడ్ ఫైవ్ జీ డేటాతో జియో సంచలనం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కేవలం పదిహేను రూపాయలకే అన్లిమిటెడ్ హైస్పీడ్ ఫైవ్జీ డేటా ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఇరవై నాలుగు గంటల వ్యాలిడిటీతో పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి వాయిస్ కాల్స్ సదుపాయం ఉండదు. రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల పాటు అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ లో సినిమాలు చూడటం, గేమింగ్ మరియు పెద్ద వీడియోలు డౌన్లోడ్ చేసుకునేవారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.