చిన్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలి: మంత్రి వివేక్కు సిఐటియు వినతి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు రూ. 18 వేల కనీస వేతనం ఇచ్చేలా చూడాలని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణానికి వచ్చిన మంత్రికి ఆయన పలు సమస్యల గురించి వివరించి ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు.

అలాగే క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు నాయకులు ఈ సందర్భంగా మంత్రిని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ప్రభుత్వ శాఖల్లోని కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.