టెక్నాలజీ సంచలనం: కృత్రిమ మేధస్సు విజయాలపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
కృత్రిమ మేధస్సు అద్భుతమైన సామర్థ్యాన్ని చూసి తనకు నిద్రలేకుండా పోయిందని, అదే సమయంలో మానవ మేధో శకం ముగుస్తోందనే ఆవేదన కలిగిందని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ వెల్లడించారు. స్ట్రైప్ కో-ఫౌండర్ జాన్ కొల్లిసన్ తో జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడుతూ, తమ కొత్త ఏఐ మోడల్ సైన్స్ మరియు గణితంలోని అత్యంత క్లిష్టమైన సమస్యలను ఇటుకల మాదిరిగా సులభంగా ఛేదించిందని, ఈ అసాధారణ పరిణామాలు తనకు ఉత్సాహంతో పాటు తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చాయని తెలిపారు.