కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంటల బీమా ద్వారా అన్నదాతలను ఆదుకున్నామని, కానీ కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తేసి రైతులను రోడ్డున పడేసిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదని, యాభై ఆరు లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరిగినా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు ముప్ఫై వేల వరకు నష్టం వాటిల్లిందని విమర్శించారు.