ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువు పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. హింస జరిగిన పంతొమ్మిది మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది. ఈనెల ఇరవై ఐదు వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈనెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది.