పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: సౌదీ అరేబియా విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెద్దా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే విమాన సర్వీసులను అక్టోబర్ ఇరవై నాలుగు వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించాయని ఎయిర్ ఇండియా గ్రూప్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.