ఉత్తరాంధ్రలో వేడెక్కిన భీమిలి రాజకీయం గంటా వర్సెస్ బొత్సగా పోరు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఇన్ఛార్జీగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష రాకతో రాజకీయ సమీకరణాలు మారాయి. మరోవైపు టీడీపీ తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకోవడంతో, ఈ నియోజకవర్గం గంటా వర్సెస్ బొత్స కుటుంబాల ప్రతిష్టాత్మక వారసుల పోరుగా మారుతోంది.