తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎం ఆయనను ఆహ్వానించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధిలో ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ సేవలు ఎంతో కీలకమని ప్రభుత్వం కొనియాడింది.