అసెంబ్లీ ఘటనపై బీఆర్ఎస్ నిరసన.. నేతల అరెస్టు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ బెల్లంపల్లిలో బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని మాదారం పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యేలపై దాడిని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రభుత్వ అణచివేతకు నిదర్శనమని మండిపడ్డారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.