సుప్రీంకోర్టులో అధికార భాషగా హిందీ పిటిషన్ కొట్టివేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

సుప్రీంకోర్టులో అధికార భాషగా హిందీని అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాలతో భాషా సంస్కరణలు సాధ్యం కాదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బ్రహ్మేశ్వర్ నాథ్ మిశ్రా వేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, ఈ అంశంపై పరిపాలనాపరమైన చర్యలు ఇప్పటికే క్రమంగా జరుగుతున్నాయని వెల్లడించింది. దేశంలోని ప్రాంతీయ భాషలను గౌరవిస్తూనే దశలవారీగా తగిన మార్పులు తెస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.