వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించాలంటూ రావిచేడ్లో రైతుల భారీ ధర్నా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రంగారెడ్డి
వ్యవసాయానికి సక్రమంగా త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కడ్తాల్ మండలం రావిచేడ్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ ఆధ్వర్యంలో షాద్నగర్-కడ్తాల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కరెంట్ కోతలు, లో-వోల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే 24 గంటల విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేశారు.