ఒంగోలులో మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ తో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధన
రిపోర్టర్: అశోక్
స్థలం: ఒంగోలు
ఒంగోలు నగరంలో మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌లో 81 వేల కుటుంబాలు ఏకతాటిపైకి వచ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాయి. కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు, కమిషనర్ వెంకట కృష్ణయ్య చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వ్యర్థాల సేకరణను పరిశీలించిన ప్రతినిధులు కమిషనర్‌కు గోల్డ్ మెడల్ అందజేశారు.