అగనంపూడి ఆసుపత్రిలో నూతన వైద్య బ్లాక్ ప్రారంభోత్సవం
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
విశాఖపట్నం జిల్లా అగనంపూడి ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబొరేటరీ మరియు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరగనుంది. ఈ నూతన భవనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, డీసీబీ చైర్మన్ కోన తాతారావు, గాజువాక జనసేన పార్టీ ఇంచార్జ్ తదితరులు పాల్గొని ప్రారంభించనున్నారు.