దిల్లీలో దారుణం 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

దిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో పదిహేడేళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 13న కుషాక్ రోడ్డులోని పొలంలో కుళ్ళిన స్థితిలో లభించిన మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, సీసీటీవీ టేజ్ ఆధారంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై బీఎన్ఎస్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.