పాకిస్థాన్కు గూఢచర్యం: ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్

రిపోర్టర్: శివ స్థలం: Vijayawada

పాకిస్థాన్ నిఘా వర్గాలకు దేశ రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచర్య నెట్వర్క్పై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ ఫైర్వాల్లో భాగంగా బిహార్కు చెందిన రాజాకుమార్, ఆదిత్య పాండేలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారతదేశ సిమ్కార్డుల ఓటీపీలను విక్రయిస్తూ పాకిస్థాన్కు వాట్సప్ ఖాతాలు యాక్టివేట్ చేయడంలో వీరు కీలకపాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. విజయవాడ కోర్టులో హాజరుపరిచిన నిందితులకు నవంబరు పదో తేదీ వరకు రిమాండ్ విధించారు.