'స్పేస్ సిటీ పేరుతో మరో భారీ భూస్కాం': రేవంత్, పొంగులేటిపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ఫ్యూచర్ సిటీ భూములను చౌకగా కాజేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త భూస్కామ్‌కు తెరలేపారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. స్పేస్ సిటీ పేరుతో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమలను కేవలం వందల కోట్లకే కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, కొండల్ రెడ్డికి చెందిన టెస్రాక్ట్ కంపెనీకి రూ. 135 కోట్ల భూమిని కేవలం రూ. 7 కోట్లకే దారాదత్తం చేశారని విమర్శించారు. డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ సమిట్‌లో స్పేస్ సిటీని అధికారికంగా ప్రకటించి వేల ఎకరాలను కొల్లగొట్టేందుకు భారీ ప్లాన్ నడుస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.