ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరుగులు: మెగాస్టార్ చిరంజీవి

రిపోర్టర్: విజయ్ స్థలం: తూర్పుగోదావరి

ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరంలో జీఎస్ఎల్ ఆసుపత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెల్త్కేర్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటు అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నటుడు మురళీమోహన్ కూడా పాలుపంచుకున్నారు.