విశాఖలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సర్వం సిద్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నంలో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు అందించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో క్రమబద్ధీకరించిన 399 ఎకరాల భూమి విలువ సుమారు రూ.8,874 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది.