ఐరాల సమీపంలో విద్యుత్ షాక్తో గజరాజు ఘోరంగా బలి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం గుబ్బులవారిపల్లె సమీపంలో విద్యుత్ షాక్కు గురై ఒక ఏనుగు మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సంబంధిత శాఖల అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ లైన్ తగలడం వల్లే ఈ ఏనుగు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.