ప్రజా సమస్యలపై అంతర్గాంలో కదంతొక్కిన గులాబీ దళం
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి అంతర్గాం మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోపాటు రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.