'ఆదోని ఆసుపత్రికి రూ. 1.27 కోట్లు': DPRO కర్నూల్ వెల్లడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా ఆదోని ఏరియా హాస్పిటల్‌కు మహర్దశ పట్టిందని DPRO కర్నూల్ వెల్లడించారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలో రూ. 1.27 కోట్ల వ్యయంతో ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని DPRO కర్నూల్ పేర్కొన్నారు.