మహాలక్ష్మి పథకంతోనే భార్య పరార్: ఎమ్మెల్యే ఎదుట వ్యక్తి విచిత్ర విజ్ఞప్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Karimnagar

భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఉచిత బస్సు పథకమే కారణమని బండి కనకయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లిలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య ఆచూకీ లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని, వెంటనే మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడి విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.