ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బి కృష్ణారావు నియామకం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

గజపతినగరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులుగా బి కృష్ణారావు నియామకం జరిగింది. విజయనగరం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి శివప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మీడియా రంగంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.