ది ప్యారడైజ్ ప్రమోషన్స్ కి దూరంగా హీరోయిన్ కయదు లోహర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కయదు లోహర్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. నానితో పాటు మిగతా నటీనటులు అన్ని ప్రాంతాల్లో ప్రసారాలు, ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నప్పటికీ, కయదు లోహర్ మాత్రం ఏ ఒక్క ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో చిత్ర యూనిట్ తో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.