స్మార్ట్ సిటీ తిరుపతికి రెండో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి
తిరుపతి స్మార్ట్ సిటీలో ఆటోమొబైల్ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నగరానికి రెండవ ఆటోనగర్ ఏర్పాటు చేయాలని టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరు సింధూజ డిమాండ్ చేశారు. రేణిగుంటలో జరిగిన ఆటోమొబైల్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికులు, యాత్రికులు పడుతున్న కష్టాలను వివరించారు. ఈ సమస్యపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆమె తెలిపారు.