దసరా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారికి కీలక భద్రతా సూచనలు జారీ చేసిన ఎస్పీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నాగర్ కర్నూల్
దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రజల భద్రత కోసం పలు కీలక సూచనలు జారీ చేశారు. ప్రయాణ సమయాల్లో ఇంట్లో నగలు, విలువైన ఆభరణాలు, నగదు నిల్వ ఉంచరాదని హెచ్చరించారు. ఇళ్లకు పటిష్టంగా తాళం వేసి, భద్రత కోసం లోపల, బయట లైట్లు వెలిగించి ఉంచాలని ఆయన సూచించారు.