వర్షాకాలంలోనే ఎండాకాలం కంటే భారీగా విద్యుత్ డిమాండ్
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో వర్షాకాలంలోనే విద్యుత్ డిమాండ్ ఎండాకాలాన్ని మించిపోయింది. రాబోయే ఎనిమిది నెలలు పక్క రాష్ట్రాల నుండి కరెంట్ కొందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులలో కనీసం సగం నీటి నిల్వలు కూడా లేకపోవడంతో భవిష్యత్తులో పంటల దిగుబడి, విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.