'లంచం డిమాండ్ చేస్తే ఖబడ్దార్': కీసర ఇన్‌స్పెక్టర్, ఎస్ఐ అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: మేడ్చల్ మల్కాజ్‌గిరి
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులు, ఎస్ఐ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, వేధించకుండా ఉండేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసి, చివరికి రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చెరువు సమీపంలో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు.