ఇంట్లో ఘనంగా వినాయక చవితి పూజలు నిర్వహించిన చంద్రబాబు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్‌తో కలిసి గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.