దేశ రాజధానిలో దారుణం, పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, కత్తితో పొడిచి అత్యంత క్రూరంగా హత్య చేశారు. కుషక్ రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో పడి ఉన్న కుళ్ళిపోయిన మృతదేహాన్ని సెప్టెంబర్ 13న పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు శివమ్‌తో పాటు మరో ముగ్గురు మైనర్లను సీసీటీవీ టేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, ఆటోను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విచారణ జరుపుతున్నారు.