టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గం రద్దు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంటూ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసింది. ఇటీవలి వివాదాల నేపథ్యంలో ఫెడరేషన్ నిర్వహించిన సమావేశంలో మెజారిటీ డ్యాన్సర్లు రఘు మాస్టర్ వైపు నిలవగా, సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతు తెలిపారు. దీంతో అక్టోబర్ 11న అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని ఫెడరేషన్ ప్రకటించింది.