మంత్రాలయంలో ఒకే కుటుంబం నుంచి కదంతొక్కిన ఓటర్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంత్రాలయం

మంత్రాలయం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఒకే కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు పన్నగ వెంకటేశప్ప స్వామి మరియు పూజారి వ్యాసరాజాచార్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. కుటుంబమంతా కలిసి ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది మరియు చర్చనీయాంశంగా మారింది.