గునాలోవాలో నూతన రహదారి ప్రారంభం: హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గునాలోవా గ్రామంలో నూతన రహదారి ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె.రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.వీరాంనాయుడుతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.