ఢిల్లీలో కలకలం: సీఈసీ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాల భారీ ఆందోళనలు

రిపోర్టర్: సురేష్ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జంతర్మంతర్ వద్ద ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుమారు మూడు వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారు. పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం గేట్ల వద్ద ఆంక్షలు విధించి ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.