'గ్రామాల్లో రెండున్నరేళ్లలో రోడ్ల నిర్మాణం': ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వెల్లడి
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
గ్రామాల్లో రెండున్నరేళ్లలో 20,600 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వెల్లడించారు. 10 వేల కి.మీ. తారు, 9,600 కి.మీ. సిమెంట్ రోడ్లతో పాటు గిరిజన గ్రామాల్లో అడవి తల్లి బాట కింద రోడ్డు సౌకర్యం కల్పించామని ఆయన తెలిపారు. అలాగే 1.15 లక్షల పంట కుంటల నిర్మాణం, 38 వేల మినీ గోకులాల ఏర్పాటుతో పాటు రామతీర్థం, అంతర్వేది, కోటప్పకొండ లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచామని ఆయన పేర్కొన్నారు.