ప్రైవేట్ పాఠశాలల అనుమతుల ప్రక్రియ సులువు: కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేసినట్లు అమరావతి వర్గాలు వెల్లడించాయి. పాఠశాలల స్థాపన, గుర్తింపునకు సంబంధించి కొన్ని నిబంధనల్ లో కీలక మార్పులు తీసుకొచ్చారు. పారిశుద్ధ్య ధ్రువీకరణ, పంచాయతీల నిరభ్యంతర పత్రాల స్థానంలో యాజమాన్యాలు స్వీయ ధ్రువీకరణ సమర్పించేలా వెసులుబాటు కల్పించారు. తప్పుడు వివరాలు ఇస్తే లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.