వినాయక చవితి వేడుకల్లో ఘనంగా సాగిన అన్నదానం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద వినాయక చవితి మూడో రోజు సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు ఆహ్వానం మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మందికి అన్నప్రసాదం అందజేశారు. ట్రాఫిక్ ఎస్సై గోవిందు, సీపీఐ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.