అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర: రాజా కృష్ణమూర్తి సంచలనం

రిపోర్టర్: హరి స్థలం: అమెరికా

అమెరికాలో తన తల్లిదండ్రులు పూజలు చేస్తున్న హిందూ దేవాలయంపై దాడి చేయడానికి కుట్ర జరిగిందని కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సంచలన ఆరోపణలు చేశారు. ఇల్లినాయిస్ లోని అరోరాలో ఉన్న గుడి వద్దకు ఒక శ్వేతజాతి ఆధిపత్యవాది రైఫిల్ తో వచ్చి కాపలా ఉన్నాడని తెలిపారు. నిందితుడి తుపాకీ జామ్ కావడం వల్లే తన కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది ప్రాణాలు దక్కాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎఫ్బిఐ డైరెక్టర్ను కోరినట్లు కృష్ణమూర్తి స్పష్టం చేశారు.