వ్యవసాయ రంగంలో కీలక మైలురాయి: దేశీయంగా తొలి పురుగుమందు ఆవిష్కరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

భారత వ్యవసాయ రంగంలో నూతన శకం మొదలైందని, దేశీయంగా తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో పియోక్సాజోన్ పురుగుమందు అణువును అభివృద్ధి చేసినట్లు పై ఇండస్ట్రీస్ వైస్ చైర్పర్సన్ మయాంక్ సింఘాల్ హైదరాబాద్లో వెల్లడించారు. వరి, మొక్కజొన్న, శనగ పంటల్లో చీడపీడల నివారణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, దాదాపు దశాబ్ద కాలం పాటు పరిశోధనలు నిర్వహించి అన్ని అనుమతులు పొందినట్లు ఆయన స్పష్టం చేశారు.