మధ్యప్రదేశ్ లో బాలికపై మైనర్ అఘాయిత్యం మరియు బ్లాక్ మెయిల్

రిపోర్టర్: అశోక్ స్థలం: మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పదవ తరగతి చదువుతున్న పదహారేళ్ల బాలికపై పదిహేడేళ్ల పొరుగు యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మార్ఫింగ్ చేసిన ప్రైవేట్ ఫోటోలు, చాట్ లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోచింగ్ కు వెళ్తున్న బాలికను అడ్డగించి ఒక ఫ్లాట్ కు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.