తిరుమల లడ్డూ ప్రసాదంలో అంతుచిక్కని వస్తువుల కలకలం
రిపోర్టర్: రాము
స్థలం: Tirumala
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కీటకాలు, అంతుచిక్కని వస్తువులు వస్తున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడింది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇంతటి నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించింది. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చెప్పి భక్తుల నమ్మకాలతో ఆటలాడుతున్నారని నిలదీసింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.