గణపతి వేషధారణలో చిన్నారుల అద్భుతమైన స్కేటింగ్ విన్యాసాలు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస పట్టణంలో వినాయక చవితి వేడుకల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్నారులు వినూత్న రీతిలో గణపతి వేషధారణలో స్కేటింగ్ చేస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. పలాస మెయిన్ రోడ్డుపై బొజ్జ గణపయ్యల గెటప్ లో చిన్నారులు చేసిన ఈ స్కేటింగ్ విన్యాసాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానికులు, ప్రయాణికులు ఆసక్తిగా తిలకించి చిన్నారులను అభినందించారు. ఈ వేడుకలు పట్టణంలో పండుగ శోభను మరింత పెంచాయి.