రాష్ట్రంలో మోగనున్న స్థానిక సమరం నగారా: ఇవాళ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠా బుధవారం షెడ్యూల్ విడుదల చేయనున్నారు. విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుండగా, తొలివిడతలో వంద పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.