విశాఖ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జాఫ్ యూనియన్ సభ్యత్వ నమోదు ప్రక్రియ!

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖ వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం జాఫ్ యూనియన్ సభ్యత్వ నమోదు, రెన్యువల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి సభ్యులు రెన్యువల్ చేసుకోవడంతో పాటు కొత్త సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. అధ్యక్షుడు కె.ఎం. కీర్తన్, ప్రధాన కార్యదర్శి జె.వి. కె.అప్పలరాజు సభ్యత్వ విధానాలు, భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో నవంబర్ 19న ఫౌండేషన్ డే నిర్వహణపై సభ్యులు విస్తృతంగా చర్చించారు.