ప్రకృతి విపత్తుల నుంచి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రిపోర్టర్: కిరణ్ స్థలం: శ్రీకాకుళం

ప్రకృతి విపత్తులు ఎదురైనా ప్రతి రైతును, ప్రతి పంటను కాపాడటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని, రైతన్న కోసం యాక్షన్ కమిటీలు, పంటల బీమాతో అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. జలధార-జలహారతి పనులతో పాటు ఖరీఫ్ సాగు కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.