భారత ఆర్థిక ప్రగతికి మేక్ ఇన్ ఇండియా కొత్త దిశానిర్దేశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఎన్టీఆర్
మేక్ ఇన్ ఇండియా కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, అది భారత పారిశ్రామిక మరియు ఆర్థిక ప్రగతికి కొత్త దిశను చూపించిన మహత్తర కార్యక్రమం అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వై.ఎస్. చౌదరి (సుజనా చౌదరి) పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగానికి అపారమైన ఊతమిస్తూ మౌలిక వసతులు, పరిశ్రమలు, ఆవిష్కరణలకు ఇది బలమైన పునాదులు వేసిందని ఆయన వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడులకు భారత్‌ను అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఈ కార్యక్రమం మార్చిందని వై.ఎస్. చౌదరి (సుజనా చౌదరి) స్పష్టం చేశారు.