మున్సిపల్ పోలింగ్ లో నెల్లిమర్ల ఓటర్ల సరికొత్త రికార్డు
రిపోర్టర్: THADI BHAVANI
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో గత నెల మొదటి తేదీన నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రాంసుందర్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల తొంబై వేలకు పైగా ఓటర్లు ఉండగా, కేవలం లక్షా తొంబై వేల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం సగటున అరవై ఐదు శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.