ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్: ఆధార్ పాన్ వివరాల సమర్పణకు గడువు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆధార్, పాన్ కార్డు వివరాలను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెన్షన్ మాడ్యుల్లో ఈ వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. అక్రమ పెన్షన్లను అరికట్టేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు వెల్లడించారు.