పొదలకూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
పొదలకూరులోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యాజమాన్యం, ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి కొనియాడారు. విద్యార్థులు గురువుల బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.